LIVE UPDATES: ఏపీని కుదిపేస్తున్న శీకాకుళం డయేరియా కేసుల వ్యవహారం
శ్రీకాకుళం డయేరియా వ్యాప్తి రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఏపీ , తెలంగాణా తాజా వార్తలు ఎప్పటికప్పుడు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ స్థాయిలో వస్తున్న తాజా వార్తలను ఎప్పటికప్పుడు మీముందుంచుతుంది HMTV Live. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళంలో డయేరియా కేసులు ఈరోజు పెద్ద అంశంగా మారాయి. అదేవిధంగా రాజమహేంద్రవరంలో కల్తీపాలు తాగి ఆరుగురు మృతి చెందడం ఆందోళన రేకెత్తిస్తోంది. తెలంగాణాలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వద్ద చెట్లను నరికివేసిన ఉదంతం రాజకీయంగా విమర్శలతో హోరెత్తిపోతోంది . ఇలానే ఎన్నో విశేషాలను ఎప్పటికప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు .
Live Updates
- 25 Feb 2026 3:32 PM IST
అసెంబ్లీలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చిట్ చాట్...
- ఫుడ్ సేఫ్టీ కి సంబంధించిన సిబ్బంది కొరత ఉంది, అలాగే ల్యాబ్ లు కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.
- కేంద్రప్రభుత్వ అనుమతి తో కొత్త సిబ్బంది నీ నియమించేందుకు పూర్తి గా దృష్టి సారిస్తున్నాము..
- కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు ల్యాబ్ లను మంజూరు చేసింది.
- 25 Feb 2026 3:31 PM IST
అసెంబ్లీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చిట్ చాట్...
- రాజమండ్రి కల్తీ పాల వ్యవహారం పై వైద్య బృందం అధ్యయనం చేస్తోంది...
- కల్తీ పాల సంఘటనల కంటే ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేస్తున్నారు...
- 25 Feb 2026 3:30 PM IST
అసెంబ్లీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చిట్ చాట్...
శ్రీకాకుళం లో వాటర్ కంటామినేషన్ వలనే డయేరియా కేసులు..ప్రస్తుతం పరిస్తితి పూర్తి గా అదుపులో ఉంది...
- 25 Feb 2026 3:26 PM IST
బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం
- బెంగళూరులోని చిక్కపేట దగ్గరలోని కంబారపేటలో ఘటన
- 175 షాపులున్న బిల్డింగ్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
- మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
- 25 Feb 2026 3:23 PM IST
హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం
కమ్ముకున్న దట్టమైన మేఘాలు
పూర్తి వార్తను ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు
- 25 Feb 2026 3:14 PM IST
రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్
- రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీవీవీ సత్యనారాయణ పై తొలగింపు వేటు
- కల్తీ పాల బాధితులకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించడంపై విధుల్లో నిర్లక్ష్యం వహించిన సూపరింటెండెంట్
- గత కొన్ని నెలలుగా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు వైద్యంపై వరుస వివాదాలు
- కొత్త సూపరింటెండెంట్ గా డాక్టర్ కెనడిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
- 25 Feb 2026 3:12 PM IST
శ్రీకాకుళం డయేరియా వ్యాప్తి కలకలం
శ్రీకాకుళం జిల్లా:
- శ్రీకాకుళం మున్సిపల్ కమీషనర్ హనుమంతు కూర్మారావు ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం
- అతిసార వ్యాప్తి లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కమీషనర్ పై వేటు..
- ఇటీవలే మున్సిపల్ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన కూర్మారావు
Next Story



