EPFO కొత్త రూల్స్: ఇల్లు కోసం PF విత్‌డ్రా ఎలా? ఎంత వరకు తీసుకోవచ్చు?

ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణానికి PF డబ్బు ఎలా తీసుకోవాలి? అర్హతలు, నిబంధనలు, ఉపసంహరణ పరిమితులు, అవసరమైన డాక్యుమెంట్స్ వివరాలు తెలుసుకోండి.

EPFO కొత్త రూల్స్: ఇల్లు కోసం PF విత్‌డ్రా ఎలా? ఎంత వరకు తీసుకోవచ్చు?
X

EPFO కొత్త రూల్స్: ఇల్లు కోసం PF విత్‌డ్రా ఎలా? ఎంత వరకు తీసుకోవచ్చు?

ఇల్లు కొనుగోలు కోసం పీఎఫ్ ఉపసంహరణకు అవకాశం: నిబంధనలు, అర్హతలపై వివరాలు

సొంత ఇల్లు నిర్మించుకోవాలనే లక్ష్యంతో ఉద్యోగులు తమ ఆదాయంలో భాగాన్ని పీఎఫ్ అకౌంట్‌లో పొదుపు చేస్తుంటారు. అవసరమైన సమయంలో ఆ నిధులను ఉపయోగించుకునే విధంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (ఈపీఎఫ్‌వో) ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తోంది. పీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని ఇల్లు కొనుగోలు, నిర్మాణం, పునరుద్ధరణ లేదా హోమ్ లోన్ చెల్లింపుల కోసం ఉపసంహరించుకునే అవకాశం ఉంది.

ఇటీవల ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ నిబంధనల్లో సడలింపులు తీసుకువచ్చినట్లు సమాచారం. కొత్త మార్పులు ఈపీఎఫ్‌వో 3.0 అమల్లోకి వచ్చిన తర్వాత దశలవారీగా అమలుకానున్నాయి. సభ్యులు నిర్దిష్ట షరతులు పూర్తి చేస్తే పీఎఫ్ నిధులను గృహ అవసరాల కోసం వినియోగించుకోవచ్చు.

అర్హతలు ఏమిటి?

పీఎఫ్ ఉపసంహరణ కోసం సభ్యుడు ఈపీఎఫ్‌వోలో నమోదు అయి ఉండాలి. యూఏఎన్ యాక్టివ్‌గా ఉండడం, కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. కొనుగోలు చేయబోయే ఇల్లు సభ్యుడు, జీవిత భాగస్వామి లేదా ఉమ్మడి పేరులో ఉండాలి. ఆస్తి యాజమాన్యాన్ని నిరూపించే పత్రాలు సమర్పించాలి. ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం కోసం కనీసం 3 నుంచి 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. హోమ్ లోన్ చెల్లింపుల కోసం అయితే సాధారణంగా దీర్ఘకాల సేవా వ్యవధి అవసరం ఉంటుంది.

ఎంత మొత్తం తీసుకోవచ్చు?

పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం నుంచి గరిష్ఠంగా 90 శాతం వరకు ఉపసంహరించుకునే వీలుంది. అయితే ఇది 36 నెలల బేసిక్ జీతం మరియు డీఏ మొత్తాన్ని మించకూడదు. ఈ రెండింటిలో తక్కువ మొత్తమే క్లెయిమ్‌గా అనుమతించబడుతుంది. పూర్తిగా 100 శాతం నగదు ఉపసంహరణకు సాధారణంగా అనుమతి ఉండదు.

ఇప్పటికే ఉన్న ఇంటి మరమ్మత్తులు లేదా పునరుద్ధరణ కోసం డబ్బు తీసుకోవాలంటే ఆ ఇంటి నిర్మాణం పూర్తై కనీసం ఐదు సంవత్సరాలు అయి ఉండాలి. దరఖాస్తు కోసం ఫారం-31 సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లు సరిగా అప్‌లోడ్ చేస్తే క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగంగా పూర్తవుతుంది. వివరాల్లో పొరపాట్లు ఉంటే క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

Next Story