Red Gram farming : పెట్టుబడి తక్కువ..లాభం ఎక్కువ..ఈ పంట వేస్తే ఎకరానికి రూ. 80 వేలు మిగులు..!

పెట్టుబడి తక్కువగా పెట్టి… సరైన పద్ధతుల్లో సాగు చేస్తే అధిక దిగుబడి, గ్యారంటీ ఆదాయం ఇచ్చే రైతులకు బెస్ట్ ఆప్షన్ పంట!

Naresh.k
Updated on: 21 Feb 2026 3:37 PM IST
Red Gram farming : పెట్టుబడి తక్కువ..లాభం ఎక్కువ..ఈ పంట వేస్తే ఎకరానికి రూ. 80 వేలు మిగులు..!
X

Red Gram farming : పెట్టుబడి తక్కువ..లాభం ఎక్కువ..ఈ పంట వేస్తే ఎకరానికి రూ. 80 వేలు మిగులు..!

తెలంగాణ అనగానే మనకు కోటి ఎకరాల్లో సాగయ్యే పత్తి, వరి పంటలే గుర్తొస్తాయి. కానీ, కాలం మారుతోంది.. మార్కెట్ డిమాండ్ మారుతోంది. కేవలం పత్తి, వరిపైనే ఆధారపడకుండా, అధిక లాభాలనిచ్చే అపరాల సాగు వైపు మొగ్గు చూపాలని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం రైతులకు పిలుపునిచ్చారు. కంది సాగు చాలామంది రైతులు కంది సాగును అంతగా పట్టించుకోరు.

కానీ, లెక్కలు చూస్తే కంది ఇచ్చే లాభం పత్తి కంటే మెరుగ్గా ఉంది.కంది పంటకు పూత దశ వరకు పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు.నవంబర్‌లో పూత సమయంలో సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే, ఎకరానికి 8 నుంచి 10 క్వింటాల దిగుబడి సాధించవచ్చు.ప్రస్తుత ధరల ప్రకారం, ఎకరాకు రూ. 1 లక్ష వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఖర్చులు రూ. 20 వేలు తీసేసినా, రైతుకు నికరంగా రూ. 80 వేలు లాభం మిగులుతుంది. ఒకప్పుడు కంది సాగు అంటే శ్రమతో కూడుకున్న పని. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది:సీడ్ డ్రిల్‌తో సులభంగా విత్తనాలు వేయవచ్చు.డ్రోన్ల సహాయంతో తక్కువ సమయంలో పిచికారీ చేయవచ్చు.హార్వెస్టర్ల ద్వారా కోతలు కోయవచ్చు. దీనివల్ల కూలీల కొరత సమస్య ఉండదు.

వరంగల్ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన వరంగల్ 97, 93, 255, 121 వంటి రకాలు ఎండు తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడిని ఇస్తాయి. అంతేకాకుండా, కంది సాగు చేయడం వల్ల నేలలో నత్రజని శాతం పెరిగి నేల సారం మెరుగుపడుతుంది. ఇది తర్వాతి పంటకు ఎంతో మేలు చేస్తుంది.రైతులు పత్తిని ఒంటరిగా కాకుండా, కందితో కలిపి అంతర పంటగా సాగు చేస్తే రిస్క్ తగ్గుతుంది.

అలాగే పెసర్లు, మినుములు, సోయా చిక్కుడు, పొద్దుతిరుగుడు వంటి పంటల వైపు దృష్టి సారిస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, మార్కెట్ అవసరాలను బట్టి పంట మార్పిడి చేసే రైతే నిజమైన విజేత. కంది సాగుతో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందే దిశగా మన రైతులు అడుగులు వేయాల్సిన సమయం ఇది.

Next Story