Health Tips: నిద్రలేవగానే నీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే డేంజర్!

Health Tips: చాలామందికి ఉదయం నిద్రలేవగానే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది.

Ganesh
Published on: 20 Feb 2026 4:40 PM IST
Health Tips: నిద్రలేవగానే నీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే డేంజర్!
X

Health Tips: చాలామందికి ఉదయం నిద్రలేవగానే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే చాలా మందికి గోరువెచ్చని నీళ్లు తాగితే మంచిదా, చల్లటినీళ్లు తాగితే మన శరీరానికి మంచిదా అనే విషయంలో సందేహాలు ఉంటాయి. దీనికి వైద్యనిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గోరువెచ్చని నీరు తాగవచ్చా..

వాతావరణం ఎలా ఉన్నా సరే, ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం అన్నిటికంటే ఉత్తమమని డాక్టర్లు చెబుతున్నారు. దీనివల్ల మన జీర్ణవ్యవస్థను యాక్టివేట్ అవుతుందని, మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుందన్నారు. రాత్రంతా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపడానికి ఇది బాగా సహాయపడుతుందన్నారు. గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి, రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుందన్నారు. మెటబాలిజంను వేగవంతం చేయడం ద్వారా బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పారు.

చల్లటి నీరు తాగవచ్చా..

ఎండలు ఎక్కువగా ఉన్నాయని చాలామంది ఉదయాన్నే ఫ్రిజ్ నీరు లేదా బాగా చల్లటి నీరు తాగుతుంటారు. కానీ, ఖాళీ కడుపుతో చల్లటి నీరు తాగడం శరీరానికి మంచిది కాదన్నారు. ఒకవేళ వేసవిలో గోరువెచ్చని నీరు తాగడం ఇబ్బందిగా అనిపిస్తే, సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని తాగడం సురక్షితం అని చెప్పారు.

* సాధారణంగా ఉదయాన్నే రెండు గ్లాసుల నీరు సరిపోతుంది. మీరు క్రీడాకారులు లేదా ఎక్కువ వ్యాయామం చేసే వారు అయితే మూడు గ్లాసుల వరకు తాగవచ్చు.

* నీటిని ఒకేసారి గటగటా తాగేయకూడదు. నిమ్మకాయ రసం లేదా కొద్దిగా తేనె కలుపుకుని సిప్ చేస్తూ నెమ్మదిగా తాగడం వల్ల పూర్తి ప్రయోజనాలు అందుతాయి.

* రేపటి నుంచి మీ ఉదయాన్ని మరీ వేడిగా కాకుండా, అలాగని చల్లగా కాకుండా.. హాయిగా ఉండే గోరువెచ్చని నీటితో ప్రారంభించండి.

Next Story