Natural Dandruff Remedy: చిటికెలో చుండ్రుకు చెక్.. ఏం చేయాలో తెలుసా!

Natural Dandruff Remedy: చుండ్రు సమస్యతో సతమతమవుతున్నారా, మార్కెట్లో దొరికే రకరకాల షాంపూలు వాడినా ఫలితం తాత్కాలికంగానే ఉంటోందా, అయితే మీ కోసం ఒక అద్భుతమైన ఇంటి చిట్కా అందుబాటులో ఉంది.

Natural Dandruff Remedy
X

Natural Dandruff Remedy: చిటికెలో చుండ్రుకు చెక్.. ఏం చేయాలో తెలుసా!

Natural dandruff remedy: చుండ్రు సమస్యతో సతమతమవుతున్నారా, మార్కెట్లో దొరికే రకరకాల షాంపూలు వాడినా ఫలితం తాత్కాలికంగానే ఉంటోందా, అయితే మీ కోసం ఒక అద్భుతమైన ఇంటి చిట్కా అందుబాటులో ఉంది. ఈ చిట్కాతో సులభమైన పద్ధతి ద్వారా చుండ్రును శాశ్వతంగా ఎలా వదిలించుకోవచ్చు తెలుసుకుందాం. సాధారణంగా మనం చుండ్రు పోవడానికి కెమికల్స్ ఉన్న షాంపూలు, కండిషనర్లు వాడుతుంటాం. నిజానికి వీటిని వాడిన రెండు రోజుల వరకు మన జుట్టు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత మళ్లీ చుండ్రు పేరుకుపోతుంది. పైగా ఇందులోని రసాయనాలు జుట్టును పొడిబారిపోయేలా చేసి, జుట్టు రాలడానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి బదులుగా వంటింట్లో దొరికే వస్తువులతోనే చుండ్రు సమస్యకు ఎలా చెక్ పెట్టాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ముందుగా మీరు ఒక గిన్నెలో తగినంత పెరుగు తీసుకోండి. అందులో తాజా కలబంద ఆకు నుంచి తీసిన జెల్‌ను కలపండి. దాంట్లో కొద్దిగా ఆవాల నూనె వేసి, ఈ మూడింటినీ బాగా మిక్స్ చేయండి. తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి, 30 నుంచి 45 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయండి.

ఇది ఎలా పనిచేస్తుందంటే..

పెరుగులో లాక్టిక్ యాసిడ్‌తో పాటు యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి చుండ్రును కలిగించే బ్యాక్టీరియాను నశింపజేస్తాయని పేర్కొన్నారు. ఇది తల చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచి, దురదను తగ్గిస్తాయన్నారు. కలబంద విషయానికి వస్తే.. ఇది తల చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుందన్నారు. ఇందులో ఉండే పోషకాలు అదనపు జిడ్డును తొలగించి, పొట్టు రాలకుండా చూస్తాయని చెప్పారు. ఆవాల నూనె జుట్టుకు మంచి తేమను అందించి, కుదుళ్లను బలంగా ఉంచుతుందని చెప్పారు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ పద్ధతిని పాటిస్తే చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా, మీ జుట్టు మృదువుగా, మెరుస్తూ కనిపిస్తుందని నిపుణులు తెలిపారు.

Next Story