Walking: తిన్న వెంటనే నడవడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారో చూడండి..

భోజనం చేసిన వెంటనే కాస్త నడక జీర్ణక్రియకు సహాయకరం అంటున్నారు నిపుణులు.. అయితే వేగంగా నడవడం కాదు, తేలికపాటి వాకింగ్‌నే మంచిదని సూచన.

Ganesh
Published on: 23 Feb 2026 4:49 PM IST
Walking: తిన్న వెంటనే నడవడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారో చూడండి..
X

Walking: తిన్న వెంటనే నడవడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారో చూడండి..

చాలామంది భోజనం చేయగానే అది అరగడానికి లేదా బరువు తగ్గడానికి నడక మొదలుపెడతారు. ముఖ్యంగా ఆఫీసుల్లో ఉండేవారు, గ్యాస్ సమస్యలు ఉన్నవారు ఇది మంచి అలవాటు అని నమ్ముతారు. అయితే, తిన్న వెంటనే నడవడం అందరికీ మంచిది కాదని, దానికి ఒక పద్ధతి ఉందని నిపుణులు చెబుతున్నారు. మనం భోజనం చేయగానే, ఆ ఆహారాన్ని అరిగించడానికి మన శరీరంలోని రక్త ప్రవాహం అంతా జీర్ణవ్యవస్థ వైపు మళ్లుతుంది. ఆ సమయంలో మనం వేగంగా నడవడం లేదా వ్యాయామం చేయడం వల్ల ఆ రక్త ప్రసరణ కాళ్లు, చేతులకు మళ్లుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

దీనివల్ల సమస్యలు ఏంటంటే..

* జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది.

* కడుపు నొప్పి లేదా అసౌకర్యం కలగవచ్చు.

* కొందరిలో యాసిడ్ రిఫ్లక్స్ (ఆమ్లత్వం) సమస్య పెరుగుతుంది.

భోజనం తర్వాత నడక విషయంలో ఈ జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత 'బ్రిస్క్ వాకింగ్' (వేగంగా నడవడం) అస్సలు చేయకూడదన్నారు. చాలా నెమ్మదిగా, హాయిగా పచార్లు చేసినట్లు నడవాలని సూచించారు. తిన్న వెంటనే కాకుండా ఒక 10 నిమిషాలు ఆగి నడక మొదలుపెట్టడం మంచిదని అన్నారు. తిన్న తర్వాత 10 నుంచి 20 నిమిషాల నడక సరిపోతుందని చెప్పారు. మరీ ఎక్కువ సేపు లేదా కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన అవసరం లేదని, కేవలం శరీరం కొంచెం చురుగ్గా మారే వరకు నడిస్తే చాలని అన్నారు. ఒకవేళ మీరు తిన్న తర్వాత పద్ధతి ప్రకారం నెమ్మదిగా నడిస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. పద్ధతి ప్రకారం నడిస్తే రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయన్నారు. మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయని, శరీర మెటబాలిజం మెరుగుపడి బరువు తగ్గడానికి సహకరిస్తుందని చెప్పారు. అలాగే తిన్న తర్వాత వచ్చే సోమరితనం, నిద్ర ముంచుకురావడం వంటివి తగ్గుతాయని అన్నారు. ఒకవేళ మీకు నడిచినప్పుడు కడుపులో ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే ఆపేయాలని నిపుణులు సూచించారు.

Next Story