అల్లు శిరీష్ పెళ్లి సందడి: పవన్ కల్యాణ్, నాగబాబులను స్వయంగా ఆహ్వానించిన అల్లు అరవింద్!

Allu Sirish Wedding: మెగా-అల్లు కుటుంబాల్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అల్లు అరవింద్ చిన్న కుమారుడు, యువ నటుడు అల్లు శిరీష్ వివాహం నయనికతో నిశ్చయమైన సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Published on: 23 Feb 2026 3:10 PM IST
అల్లు శిరీష్ పెళ్లి సందడి: పవన్ కల్యాణ్, నాగబాబులను స్వయంగా ఆహ్వానించిన అల్లు అరవింద్!
X

అల్లు శిరీష్ పెళ్లి సందడి: పవన్ కల్యాణ్, నాగబాబులను స్వయంగా ఆహ్వానించిన అల్లు అరవింద్!

Allu Sirish Wedding: మెగా-అల్లు కుటుంబాల్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అల్లు అరవింద్ చిన్న కుమారుడు, యువ నటుడు అల్లు శిరీష్ వివాహం నయనికతో నిశ్చయమైన సంగతి తెలిసిందే. మార్చి 6న జరగనున్న ఈ వేడుకకు సంబంధించి ఏర్పాట్లు ప్రస్తుతం ఫుల్ జోష్‌లో సాగుతున్నాయి.

తాజాగా అల్లు అరవింద్ తన భార్యతో కలిసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మెగా బ్రదర్ నాగబాబు ఇళ్లకు వెళ్లి పెళ్లి శుభలేఖలు అందించారు. సంప్రదాయబద్ధంగా వారికి నూతన వస్త్రాలు అందజేసి, వివాహ వేడుకకు రావాలని సాదరంగా ఆహ్వానించారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి దంపతులకు కూడా ఆహ్వానం అందింది.

ఇంట్లో పసుపు దంచే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అటు దుబాయ్‌లో స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన శిరీష్, తాజాగా హైదరాబాద్‌లో సినీ ప్రముఖులకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలో రామ్ చరణ్ దంపతులు, శ్రీలీల, మృణాల్ ఠాకూర్ వంటి తారలు సందడి చేశారు.

మార్చి 6న హైదరాబాద్‌లోనే అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహ వేడుక జరగనుంది. అల్లు అర్జున్ స్వయంగా తన తమ్ముడి పెళ్లి పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తుండటంతో అల్లు అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

Next Story