Chinmayi Sripada: చిన్మయిపై నెటిజన్ నీచమైన కామెంట్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సింగర్!

Chinmayi Sripada: ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కేవలం తన గొంతుతోనే కాకుండా, సామాజిక సమస్యలపై తను ఎక్కుపెట్టే విమర్శలతోనూ ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.

Naresh.k
Published on: 22 Feb 2026 11:05 AM IST
Chinmayi Sripada
X

Chinmayi Sripada: చిన్మయిపై నెటిజన్ నీచమైన కామెంట్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సింగర్!

Chinmayi Sripada: ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కేవలం తన గొంతుతోనే కాకుండా, సామాజిక సమస్యలపై తను ఎక్కుపెట్టే విమర్శలతోనూ ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక వేధింపుల గురించి చిన్మయి చేసే పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకం. అయితే, ఈ క్రమంలో ఆమె ఎదుర్కొనే ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఒక నెటిజన్ ఆమెపై చేసిన అత్యంత దారుణమైన కామెంట్, దానికి చిన్మయి ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఎప్‌స్టీన్ కుంభకోణం పై చిన్మయి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ స్కాండల్‌లో వెలుగులోకి వస్తున్న దారుణాలను ప్రస్తావిస్తూ.. సమాజంలోని చీకటి కోణాలను ఆమె ఎండగట్టారు. ప్రతి ఇంట్లోనూ ఎప్‌స్టీన్‌లు ఉంటారు. మత పెద్దలను కూడా గుడ్డిగా నమ్మకండి. భారతదేశంలో లక్షలాది మంది బాల లైంగిక నేరస్థులు ఉన్నారు. మీకు తెలిసిన ఏ అమ్మాయినైనా అడగండి.. ఆమె మొదటిసారి ఏ వయసులో వేధింపులకు గురైందో చెబుతుంది అంటూ ఒక ఆవేదనతో కూడిన పోస్ట్ పెట్టారు.

చిన్మయి చేసిన ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ ఒక నెటిజన్, విచక్షణ కోల్పోయి అత్యంత నీచంగా స్పందించాడు. "నీ తండ్రే నిన్ను రేప్ చేసి ఉంటాడు.. అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు" అంటూ ఒక ఆడపిల్ల మనసు ముక్కలయ్యేలా చీప్ కామెంట్ చేశాడు. సాధారణంగా ఇలాంటి కామెంట్స్ చూస్తే ఎవరైనా కుంగిపోతారు లేదా భయపడతారు. కానీ చిన్మయి అస్సలు తగ్గలేదు.

సదరు నెటిజన్‌కు చిన్మయి తనదైన శైలిలో బుద్ధి చెప్పారు. నా తండ్రి నన్ను అత్యాచారం చేయలేదు. కానీ కూతుళ్లు తమ తండ్రులచే అత్యాచారం చేయబడతారని మీరు ఊహిస్తున్నారంటే.. మీ సంస్కృతి ఏంటో, మీరు పెరిగిన వాతావరణం ఏంటో అర్థమవుతోంది. మిమ్మల్ని పెంచిన విధానం మీ బిహేవియర్ లో స్పష్టంగా కనిపిస్తోంది అంటూ అతడి చెంప చెళ్లుమనిపించేలా సమాధానం ఇచ్చారు.

చిన్మయి ఇచ్చిన ఈ స్ట్రాంగ్ కౌంటర్‌కు నెటిజన్ల నుండి భారీ మద్దతు లభిస్తోంది. వ్యక్తిగత విమర్శలు చేయడం వేరు, ఇలా కుటుంబ సభ్యులను లాగుతూ వికృతమైన కామెంట్స్ చేయడం సంస్కారహీనం అంటూ సదరు నెటిజన్‌ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. తనపై ఎన్ని దాడులు జరిగినా, ఎంత నెగిటివిటీ వచ్చినా చిన్మయి తన గళాన్ని వినిపించడంలో వెనక్కి తగ్గకపోవడం విశేషం. సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ అంటే అవతలి వారిని కించపరచడం కాదని, కనీస మానవత్వం ఉండాలని ఈ ఘటన మరోసారి నిరూపించింది. చిన్మయి తెగువను చూసి ఆమె అభిమానులు రియల్ ఫైటర్ అంటూ ప్రశంసిస్తున్నారు.



Next Story