Vijay: డీఎంకేకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే.. వేలూరు సభలో సీఎం స్టాలిన్‌పై విజయ్ నిప్పులు!

TVK Chief Vijay Fire on CM Stalin: తమిళనాడు రాజకీయాల్లో వేడి పుట్టిస్తూ 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్ అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Arun Chilukuri
Published on: 23 Feb 2026 3:47 PM IST
Vijay: డీఎంకేకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే.. వేలూరు సభలో సీఎం స్టాలిన్‌పై విజయ్ నిప్పులు!
X

Vijay: డీఎంకేకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే.. వేలూరు సభలో సీఎం స్టాలిన్‌పై విజయ్ నిప్పులు!

TVK Chief Vijay Fire on CM Stalin: తమిళనాడు రాజకీయాల్లో వేడి పుట్టిస్తూ 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్ అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వేలూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతిని, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే తనను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య యుద్ధం:

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కేవలం ఓట్లు వేసే ప్రక్రియ కాదని, ఇది తమిళనాడు ప్రజలకు మరియు అవినీతి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధమని విజయ్ అభివర్ణించారు. "అవినీతిని ప్రశ్నిస్తున్నాననే కక్షతో మా పార్టీ సభలకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేను వెనక్కి తగ్గను, అవినీతిపై నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది" అని ఆయన స్పష్టం చేశారు.

డీఎంకే, బీజేపీ ఒక్కటే:

సీఎం స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై విజయ్ సంచలన ఆరోపణలు చేశారు. "డీఎంకేకు ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్లే. ఓటమి భయంతోనే స్టాలిన్ ప్రభుత్వం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా రంగులు మార్చడం ఆ పార్టీ నేతలకు అలవాటే" అంటూ దుయ్యబట్టారు. రాష్ట్రంలో నేరాలు, అవినీతిని అరికట్టడంలో స్టాలిన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.

గ్రామ గ్రామానికి వస్తా - విజయ్ హామీ:

ప్రస్తుతం ప్రభుత్వం ఆంక్షల వల్ల అన్ని ప్రాంతాల ప్రజలను కలవలేకపోతున్నానని, కానీ ఎన్నికల్లో విజయం సాధించి టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని స్వయంగా సందర్శిస్తానని విజయ్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ యుద్ధంలో అంతిమ విజయం ప్రజలదేనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story