Pregnant Women: మీ ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉందా..? అయితే రూ. 11,000 మీవే..!

Pregnant Women: మాతృత్వం అనేది ప్రతి మహిళ జీవితంలో ఒక మధురమైన ఘట్టం. అయితే, గర్భధారణ సమయంలో సరైన పోషకాహారం, వైద్య సదుపాయాలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

Naresh.k
Published on: 22 Feb 2026 10:58 AM IST
Pregnant Women
X

Pregnant Women: మీ ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉందా..? అయితే రూ. 11,000 మీవే..!

Pregnant Women: మాతృత్వం అనేది ప్రతి మహిళ జీవితంలో ఒక మధురమైన ఘట్టం. అయితే, గర్భధారణ సమయంలో సరైన పోషకాహారం, వైద్య సదుపాయాలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని మహిళలకు ఈ సమయంలో ఆర్థిక అండ అవసరం. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి మాతృ వందన యోజన'అనే అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తోంది. కానీ, అవగాహన లేక ఇప్పటికీ లక్షలాది మంది మహిళలు ఈ ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు.

గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు శారీరకంగా దృఢంగా ఉండాలని, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయం అందిస్తుంది. పనికి వెళ్లే మహిళలు గర్భధారణ సమయంలో విశ్రాంతి తీసుకునేటప్పుడు వారికి కలిగే ఆదాయ నష్టాన్ని ఈ నగదు కొంతవరకు భర్తీ చేస్తుంది.

ఈ పథకం కింద మొదటి, రెండో కాన్పులకు వేర్వేరుగా నగదు ప్రోత్సాహకాలు అందుతాయి.మొదటి కాన్పుకు రూ. 5,000. ఈ మొత్తం మూడు విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.మొదటి విడత రూ. 1,000. గర్భం దాల్చినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే అకౌంట్‌లో వేస్తారు.రెండో విడత రూ. 2,000. ఆరో నెల నిండిన తర్వాత కనీసం ఒక యాంటీనేటల్ చెకప్ పూర్తయిన తర్వాత అందుతాయి.మూడో విడత రూ. 2,000. బిడ్డ పుట్టిన తర్వాత, జనన ధృవీకరణ పత్రం మరియు మొదటి దశ టీకాలు పూర్తయిన తర్వాత ఇస్తారు.

రెండో కాన్పుకు రూ. 6,000.రెండో సంతానం గనుక ఆడపిల్ల అయితే, కేంద్ర ప్రభుత్వం మాతృత్వాన్ని మరింత ప్రోత్సహించేందుకు ఏకంగా రూ. 6,000 అందిస్తుంది. ఇది బిడ్డ పుట్టిన తర్వాత అన్ని పరీక్షలు పూర్తయ్యాక ఒకేసారి ఖాతాలో జమ అవుతుంది.

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. దీనికి రెండు మార్గాలు ఉన్నాయి.అంగన్‌వాడీ/PHC ద్వారా: మీ ప్రాంతంలోని అంగన్‌వాడీ కేంద్రం లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి దరఖాస్తు ఫారమ్ నింపవచ్చు. PMMVY అధికారిక వెబ్‌సైట్ ద్వారా నేరుగా మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్కడ 'న్యూ రిజిస్ట్రేషన్' పై క్లిక్ చేసి వివరాలు నింపాలి. అయితే, దీనికి అంగన్‌వాడీ లేదా ఆరోగ్య కార్యకర్తల ధృవీకరణ అవసరం.

కావాల్సిన పత్రాలు..

తల్లి ఆధార్ కార్డ్.బ్యాంకు ఖాతా వివరాలు (నగదు నేరుగా ఖాతాలోకే వస్తుంది).గర్భధారణ పరీక్ష నివేదిక.శిశువు జనన ధృవీకరణ పత్రం. ప్రభుత్వం అందిస్తున్న ఈ సుమారు రూ. 11,000 (రెండు కాన్పులు కలిపి) సాయం గర్భిణీలకు పోషకాహారం తీసుకోవడానికి ఎంతో తోడ్పడుతుంది. మీ ఇంట్లో గానీ, మీకు తెలిసిన వారిలో గానీ గర్భిణీలు ఉంటే వెంటనే ఈ పథకం గురించి తెలియజేయండి. సరైన సమయంలో దరఖాస్తు చేసుకుని సర్కారు ఇచ్చే ఈ మాతృత్వ కానుకను అందుకోండి.

Next Story