T20 World Cup 2026: జింబాబ్వే మ్యాచ్‌కు ముందు భారత్‌కు శుభవార్త.. సెమీస్ సమీకరణాలు

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ సూపర్-8లో దక్షిణాఫ్రికాతో ఓటమి తర్వాత భారత్‌కు జింబాబ్వే మ్యాచ్‌కు ముందు శుభవార్త. సెమీస్ చేరే సమీకరణాలు ఇవే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Feb 2026 11:47 AM IST
T20 World Cup 2026
X

 T20 World Cup 2026: జింబాబ్వే మ్యాచ్‌కు ముందు భారత్‌కు శుభవార్త.. సెమీస్ సమీకరణాలు

టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో భారత్‌ సెమీఫైనల్‌ అవకాశాలు కాస్త క్లిష్టమయ్యాయి. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌లు జింబాబ్వే, వెస్టిండీస్‌లపై తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదిలా ఉంటే భారత్‌కు జింబాబ్వే మ్యాచ్‌కు ముందు శుభవార్త అందింది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు కొత్త పిచ్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. దేశవాళీ మ్యాచ్‌లకు ఇప్పటివరకు ఉపయోగించని ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. బంతి బ్యాట్‌పై బాగా రావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

సెమీఫైనల్ సమీకరణాలు

భారత్ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే:

జింబాబ్వే, వెస్టిండీస్‌పై విజయాలు సాధిస్తే భారత్‌కు నాలుగు పాయింట్లు చేరతాయి. అదే సమయంలో దక్షిణాఫ్రికా తన మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిస్తే భారత్‌కు సెమీఫైనల్ అవకాశాలు బలపడతాయి. ఒకవేళ దక్షిణాఫ్రికా వెస్టిండీస్ చేతిలో ఓడిపోతే మూడు జట్లు నాలుగు పాయింట్లతో సమానంగా నిలిచే అవకాశం ఉంది. అప్పుడు నెట్ రన్‌రేట్ కీలకం అవుతుంది.

భారత్ ఒకే మ్యాచ్ గెలిస్తే:

ఒక మ్యాచ్ గెలిచి మరొకదాంట్లో ఓడిపోతే పరిస్థితి కఠినంగా మారుతుంది. దక్షిణాఫ్రికా నేరుగా సెమీఫైనల్‌కు చేరే అవకాశం ఉంది. రెండో స్థానానికి భారత్, జింబాబ్వే, వెస్టిండీస్ జట్ల మధ్య నెట్ రన్‌రేట్ ఆధారంగా పోటీ కొనసాగుతుంది.

Next Story